ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలోని బార్‌లు, రెస్టారెంట్‌లు, హోటల్‌ల నుంచి లంచం వసూలు చేయాలనిని తన అధీనంలో ఉన్నవారికి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పినట్లుగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ముంబై మాజీ పోలీస్ ఉన్నతాధికారి పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ తన మీద సీబీఐ విచారణ జరిపించాలని ముంబై హైకోర్టు ఆదేశించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
