పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు సిద్ధమైన సీబీఐ

V6 Velugu Posted on Nov 25, 2021

జడ్జీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ అరెస్టుకు సిద్ధమైంది సీబీఐ.  అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ ఈనెల 1న లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసు లో CBI తాజా అఫిడవిట్ దాఖలు అయ్యింది. దీన్ని సీబీఐ డైకెర్టర్ జైస్వాల్ హైకోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికే అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న పాకీ ప్రభాకర్ రెడ్డికి CBI బ్లూ నోటీసును జారీ చేసింది. నవంబర్ 8న అరెస్ట్ చేసేందుకు వారెంట్ తీసుకుని తర్వాతి రోజు నవంబర్ 9న ఇంటర్ పోల్ కు సమాచారం ఇచ్చి సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేసుకు సంబంధించిన అందరినీ పిలిచి ప్రశ్నిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. జడ్జీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో 17వ నిందితుడిగా పంచ్‌ ప్రభాకర్‌ పేరు చేర్చినట్లు సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.

Tagged cbi, arrest, prepares, Punch Prabhakar

Latest Videos

Subscribe Now

More News