
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ శుభా కాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాప్ర యోజనాలు, ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎస్, ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంతో కలిసి పని చేస్తారని చెప్పారు.
రాష్ట్రా న్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సహా య, సహకారాలు అందిస్తామని వెల్లడించారు. రెండు దశాబ్దాల సీపీఎస్ ఉద్యోగుల పాత పింఛన్ ఆకాంక్షను నెరవేర్చబోతున్న సీఎం రేవంత్ రెడ్డికి మూడు లక్షల కుటుంబాలు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు.