ఎంపీ వంశీకృష్ణ చొరవతో రోడ్డు నిర్మాణానికి ఫండ్స్

ఎంపీ వంశీకృష్ణ చొరవతో రోడ్డు నిర్మాణానికి ఫండ్స్

నస్పూర్, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్​పరిధి కృష్ణకాలనీలో ఎంపీ ఫండ్స్​ రూ.6.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సోమవారం వివేక్​ యువసేన వ్యవస్థాపక ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ సెంట్రల్​ సెక్రటరీ బరుపతి మారుతీ ప్రారంభించారు. 

ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవచూపి సీసీ రోడ్డుకు నిధులు సాంక్షన్​ చేశారన్నారు. పార్లమెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎంపీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. లీడర్లు, ఆటో యూనియన్, టెంపుల్​కమిటీ బాధ్యులు సంఘి సదానందం, రాగిడి రాజు, సమ్మయ్య, కొల్లూరి మల్లేశ్, రాంరెడ్డి, లశెట్టి శ్రీనివాస్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.