100 దేశాల్లో కస్టమర్లు రూ.400 కోట్లతో ఏపీలో కొత్త ప్లాంటు

100 దేశాల్లో  కస్టమర్లు రూ.400 కోట్లతో ఏపీలో కొత్త ప్లాంటు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వెలుగు:  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ తయారీలో పేరొందిన హైదరాబాద్​ కంపెనీ  సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల  (రూ.8,200 కోట్లు) మార్కును కంపెనీ అందుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  దుగ్గిరాల వద్ద  1995లో  సీసీఎల్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్ మొదలైంది. ఇప్పుడు ఈ కంపెనీకి  100 కి పైన దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కొక్క ప్లాంటుతో  సీసీఎల్  ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేస్తోంది. అతి తక్కువ కాలంలోనే కాఫీ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో ప్లేస్​కి చేరినట్టు సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మీడియాకు తెలిపారు. గ్లోబల్​మార్కెట్లో పేరొందిన  కాఫీ బ్రాండ్లకు నమ్మకమైన  సప్లయర్​గా మారడమే తమ విజయరహస్యమని చెప్పారు​. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ తయారీలో సీసీఎల్​ మొదటి ప్లేస్​లో నిలుస్తోందని పేర్కొన్నారు. కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈడీ మోహన్ కృష్ణ కూడా మీడియాతో మాట్లాడారు. 1,000కిపైగా రుచుల్లో కాఫీని  కంపెనీ అందిస్తోంది. వీటిలో ఫంక్షనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ, కోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రూ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ, మైక్రోగ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్యూజ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ, స్పెషాలిటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

ఏపీలో మరో యూనిట్​..

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  తిరుపతి వద్ద  కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాఫీ పార్కులో సీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్తగా యూనిట్​ను  ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో వచ్చే ఈ యూనిట్​ కోసం కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కొత్త యూనిట్​కు 16,000  టన్నుల  కెపాసిటీ ఉంటుంది. వచ్చే ఏడాది ప్రొడక్షన్​ మొదలవుతుంది.