న్యూఢిల్లీ: భారతదేశంలోని 45 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అత్యంత ప్రమాదకర స్థాయికి (క్రిటికల్ లెవెల్స్) పడిపోయాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి 31గా ఉన్న ఈ ప్లాంట్ల సంఖ్య ఆగస్టు 25 నాటికి 45కి పెరిగింది.
వీటిలో 3 రోజులకు సరిపడా కూడా నిల్వలు లేనివి 40 ప్లాంట్లు ఉన్నాయి. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రధాన బొగ్గు ఉత్పత్తి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైనింగ్ దెబ్బతింది. కొన్ని ప్రాంతాలలో ఎల్ నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరగగా, ఏసీల వినియోగం కూడా ఎక్కువైంది. ఫలితంగా కరెంట్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది.
