
జమ్మూకశ్మీర్ లో త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు సీఈసీ ప్రకటించింది. కశ్మీర్‌లో ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం రిజిస్టర్డ్ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించినట్టు సీఈసీ సెక్రటరీ జయదేబ్ లాహిరి తెలిపారు. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుపైనా కసరత్తు చేపట్టినట్టు వెల్లడించారు.
ఇక చివరిగా జమ్ముకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. అనంతరం కొన్ని రాష్ట్రపతి పాలన జరిగింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇక కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. 2024 సెప్టెంబర్ 30 నాటికి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవలని సీఈసీని ఆదేశించింది. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.