90 Years Of Telugu Cinema: మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ళ వేడుకలు: మంచు విష్ణు

90 Years Of Telugu Cinema: మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ళ వేడుకలు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు(Manchu Vishnu) ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు చలచిత్ర తొంబై ఏళ్ళ(90 years of telugu cinema) వేడుకలను మలేషియాలో ఘనంగా నిర్వహించబోతన్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ వేడుకల్ని మలేషియాలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్ని జులై లో నిర్వహించబోతున్నామని,ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి ఒక డేట్ ని ఫైనలైజ్ చేస్తామని తెలిపారు.

ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా చాలా గొప్పదని, తెలుగు నటులుగా ఉన్నందుకు మనమంతా గర్వపడాలని అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని తొడగొట్టి చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, ఈ వేడుకలు వైభవంగా జరగాలంటే తెలుగు ఇండస్ట్రీలో మూడురోజులు అవసరమని, ఈ విషయం గురించి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజుతో మాట్లాడం అని తెలిపారు మంచు విష్ణు. ఇవన్నీ చూస్తుంటే ఈ వేడుకలను మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని అర్థమవుతోంది. 

ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కన్నప్ప అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకుక్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్బంగా ఈ సినిమా నుండి విడుదలైన మంచు విష్ణు ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మంచు విష్ణు చాలా ఆశలే పెట్టుకున్న కన్నప్ప సినిమా ఆయనకీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.