
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం(Vyooham) సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. గతేడాది నవంబర్ 13 న థియేటర్లోకి రావాల్సిన వ్యూహం వాయిదా పడుతూ వస్తుంది.
ఇక తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదల కాబోతుందని తెలిపారు. 'వ్యూహం సినిమాకు ఎదురైన సమస్యలు క్లియర్ అయ్యాయని తెలియజేసేందుకు..నేను చాలా సంతోషంగా ఉన్నాను..విడుదల తేదీని అతి త్వరలో ప్రకటిస్తాం' అంటూ చంద్రబాబు ఫొటోతో ట్వీట్ చేశారు. హైకోర్టు (High Court) సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ విడుదల చేయడంతో..ఈ నెల (ఫిబ్రవరి23న) సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత రెడీ అయ్యారు.
వ్యూహం మూవీలో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను..కించపరిచే విధంగా ఉందని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌తో (Nara Lokesh) పాటు మరికొందరు సినిమాను రిలీజ్ కాకుండా కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీంతో సినిమా ఇన్నాళ్ళుగా విడుదలకు బ్రేక్ పడింది. ఇక ఆర్జీవీ తర్జన..భర్జనలు పడి..ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. మరి థియేటర్లో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి
I AM VERY VERY HAPPY to INFORM that VYOOHAM film’s RELEASE ISSUES are CLEARED..Release date will be ANNOUNCED VERY SOON ????????? pic.twitter.com/DiVXcWsCoZ
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2024