వంట నూనెల రేట్లు తగ్గుతాయని కేంద్రం అంచనా

వంట నూనెల రేట్లు  తగ్గుతాయని కేంద్రం అంచనా

న్యూఢిల్లీ: వంటనూనెల ధరలను ఇది వరకే చాలా కంపెనీలు తగ్గించాయని, మిగతా కంపెనీలు కూడా లీటరుకు రూ.15 వరకు తగ్గిస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం ప్రకటించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గినందున, మనదేశంలోనూ రేట్లు తగ్గుతాయని పేర్కొంది. రేట్లను తగ్గించాలని బుధవారం కంపెనీలను ఆదేశించడంతో మదర్​ డెయిరీ సానుకూలంగా స్పంది తన ధారా బ్రాండ్​ సోయాబీన్, రైస్​బ్రాన్​ధరలను లీటరుకు రూ.14 వరకు తగ్గించింది. రాబోయే 20 రోజుల్లోపు సన్​ఫ్లవర్​ ఆయిల్ ధరలనూ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వంటనూనెల ధరలను ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తున్నామని, నూనెల దిగుమతులపై సుంకాలనూ తగ్గించినందున రేట్లు తప్పక తగ్గుతాయని కేంద్ర ఆహార, కన్జూమర్​ ఎఫైర్స్​మినిస్ట్రీ ప్రకటించింది.

ఇంటర్నేషనల్​ మార్కెట్లలో నూనెల రేట్లు తగ్గుతున్న విషయాన్ని మనదేశంలోని రిఫైనర్లకు, కంపెనీలకు తెలియజేశామని, ఇందుకు ప్రత్యేకంగా మీటింగ్​ పెట్టామని పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే రేటు తగ్గిస్తే, అదేస్థాయిలో కన్జూమర్​కూ తగ్గింపు ఇవ్వాలని స్పష్టం చేశామని వెల్లడించింది. కిందటి నెలలో ఇంటర్నేషనల్​ మార్కెట్లో వంటనూనెల ధరలు టన్నుకు 300-–450 డాలర్ల వరకు పడిపోయాయి. రిటైల్ మార్కెట్లలో ధరల తగ్గుదలకు కొంచెం టైం పడుతుందని భావిస్తున్నారు.  ఫార్చ్యూన్ బ్రాండ్ పోయిన నెలలో సన్‌‌‌‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్స్​పై లీటరుకు రూ. 10 తగ్గించింది.