V6 News

ఐటీఐ, డిగ్రీ అర్హతతో సి–మెట్లో కొలువులు.. మే 5న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు..

ఐటీఐ, డిగ్రీ అర్హతతో సి–మెట్లో కొలువులు.. మే 5న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు..

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సి–మెట్) ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్​ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, జూనియర్ రీసెర్చ్ ఫెలో 1, టెక్నికల్ అసిస్టెంట్ 5, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ 1.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 37 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 5.

సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ  ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cmet.gov.in ను సందర్శించండి.