CM Kejriwal: బెయిల్ పిటిషన్పై విచారణ రోజే ఢిల్లీ సీఎంకు సీబీఐ ఝలక్

CM Kejriwal: బెయిల్ పిటిషన్పై విచారణ రోజే ఢిల్లీ సీఎంకు సీబీఐ ఝలక్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సోమవారం నాడు (29-07-2024) మరో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగాలతో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇదే వ్యవహారానికి సంబంధించి సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.

 

సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. జులై 29న అంటే ఇవాళ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా కేజ్రీవాల్పై మరో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం గమనార్హం. ఢిల్లీ సీఎం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. జైలులో ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుండటంతో ఆమ్ ఆద్మీ నేతలు కలవరపడుతున్నారు. జూన్ 3 నుంచి జులై 7 వరకూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ 34 సార్లు పడిపోయాయని ఆప్ రాజ్య సభ ఎంపీ సందీప్ పాతక్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఆగస్ట్ 8 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.