సరోగసి బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. 16 వారాల ఇన్సూరెన్స్ 36 వారాలకు పెంపు

సరోగసి బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. 16 వారాల ఇన్సూరెన్స్ 36 వారాలకు పెంపు

జమ్మూ, కాశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
1480 కోట్లతో ఎన్‌టీటీఎం ఏర్పాటుకు పచ్చజెండా
డీపీఈ గైడ్ లైన్స్ నుంచి ఐపీజీఎల్‌కు మినహాయింపు
కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయాలను వెళ్లడించిన మంత్రి జవదేకర్

న్యూఢిల్లీ: సరోగసీ నియంత్రణ బిల్లు 2020కి కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనకు తానుగా ఇష్టపూర్వకంగా ముందుకొచ్చే మహిళ ద్వారా పిల్లలులేని దంపతులు సంతానం పొందవచ్చంటూ ఈ బిల్లు సరోగసీకి ఆమోదం చెబుతోంది. విడోలు, విడాకులు తీసుకున్న మహిళలకూ ప్రయోజనం దక్కేలా ప్రభుత్వం ఈ బిల్లులో ప్రతిపాదనలు చేసింది. వాస్తవానికి ఈ బిల్లుకు లోక్ సభ 2019 ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. అయితే, దగ్గరి బంధువు సాయంతో మాత్రమే సరోగసీ విధానంలో సంతానం పొందే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించడం విమర్శలకు కారణమైంది. దీనిపై రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్లాజ్‌తో పాటు మరికొన్ని మార్పులు చేయాలంటూ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించింది. కమిటీ చేసిన ప్రతిపాదనలు, రికమెండేషన్ల ప్రకారం ప్రభుత్వం బిల్లులో మార్పులు చేసింది. ఈ బిల్లుకు ప్రస్తుతం కేబినెట్ ఓకే చెప్పింది. సరోగసీ కమర్షియలైజ్ కాకుండా నిజంగా అవసరమున్న కేసుల్లోనే ఉపయోగించేలా మార్పులు చేశామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరూ పుట్టుకతో భారతీయులైతేనే మనదేశంలో సరోగసీ ద్వారా బిడ్డను పొందే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి
స్మృతి ఇరానీ చెప్పారు. మహిళలకు సంబంధించి రిప్రొడక్టివ్ రైట్స్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ లిబరల్‌గా వ్యవహరించారని తెలిపారు. అదేవిధంగా సరోగసీ మదర్‌కు ఇప్పటి వరకున్న 16 వారాల ఇన్సూరెన్స్ పీరియడ్‌ను ప్రభుత్వం 36 వారాలకు పెంచింది. ఈ బిల్లును వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సెషన్‌లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా, హర్యానా, తమిళనాడులలోని రెండు ఫుడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లకు నేషనల్ ఇంపార్టెన్స్ గుర్తింపు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఛాబహర్ పోర్ట్​ ప్రాజెక్ట్​ నిర్వహణ స్మూత్‌గా జరిగేందుకు ఇండియా పోర్స్ట్ గ్లోబల్ లిమిటెడ్(ఐఎల్‌పీజీఎల్)ను డిపార్ట్​మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్(డీపీఈ) గైడ్ లైన్స్ నుంచి తప్పించేందుకు కేబినెట్ ఓకే చెప్పిందని మంత్రి జవదేకర్ వివరించారు.

జమ్మూ కాశ్మీర్‌లో కేంద్ర చట్టాలు..
కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ, కాశ్మీర్లలో 37 కేంద్ర చట్టాల అడాప్షన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిం ది. ఈమేరకు ఆర్డర్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్టోబర్ 31, 2019 నుంచి జమ్మూ, కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అధికారికంగా గుర్తింపు పొందాయి. దీంతో గతంలో ఇక్కడ చెల్లని కేంద్ర చట్టాలు ఇప్పుడు అమలవుతాయని, దీనికోసం ముందుగా కేంద్ర చట్టాలను అడాప్ట్​ చేసుకోవడం తప్పనిసరని జవదేకర్ వివరించారు. ఇందుకోసం జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్​లోని ప్రొవిజన్స్ ప్రకారం ఆర్డర్ జారీ చేస్తామన్నారు.

నేషనల్ టెక్స్​టైల్స్​ మిషన్
టెక్స్​టైల్ రంగంలో దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు రూ.1480 కోట్ల ఖర్చుతో నేషనల్ టెక్స్ టైల్స్ మిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మిషన్‌కు నాలుగేళ్ల ఇంప్లిమెంటేషన్ పీరియడ్ (2020–21 నుంచి 2023–24 వరకు) ఉంటుంది. ఈమేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎకనామిక్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

For More News..

20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..