
న్యూఢిల్లీ: పది మంది ఐపీఎస్ అధికారులను ముందస్తుగా పదవీ విరమణ చేయాలని కేంద్రం ఆదేశించినట్టు తెలిసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యాఈ నిర్ణయం తీసుకున్నామని సర్కారు చెప్పినట్టు సమచారం. నలుగురు ఐఏఎస్ అధికారులకూ ఇవే ఆదేశాలు జారీ చేసిందని, వారి పేర్లు మాత్రం వెల్లడించలేదని తెలిసింది. సర్వీసుకు పనికిరాని వాళ్ల ఏరివేతలో భాగంగా మోడీ సర్కారు సర్వీసు రికార్డుల రివ్యూ పద్ధతిని మొదలుపెట్టిందని గురువారం ఓ అధికారి చెప్పారు. 2016 నుంచి 2018 వరకు1,181 మంది అధికారుల రికార్డులను కేంద్ర హోంశాఖ పరిశీలించిందన్నారు. 2015 నుంచి 2018 మధ్య 1,143 మంది ఐఏఎస్ అధికారుల పనితీరునూ అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 1958లోని16 (3) రూల్ ప్రకారం ఐపీఎస్‌ల రికార్డులను హోంశాఖ పరిశీలించిందని, ఆ రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సంప్రదించి సరిగా పని చేయనివారిని రాజీనామా చేయాలని కోరవచ్చని వివరించారు. ఇందుకు మూడు నెలల ముందే వారికి నోటీసులిచ్చి మూడు నెలల జీతం ఇస్తారన్నారు. 2014,2015ల్లో రికార్డులను ప్రభుత్వం చెక్ చేయలేదనిచెప్పా రు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడురివ్యూ చేస్తే బాగా పని చేసేవారిని ప్రోత్సహించడంతో పాటు మంచి పనితీరు కనబరచని వారినిబాగు చేసుకోవాలని చెప్పడమో, లేక సర్వీస్‌లోంచి తొలగించడమో జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 4,940 మంది ఐపీఎస్ అధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం 3,972 మందే పని చేస్తున్నారు.