ఇంటింటికీ సోలార్ పవర్ కేంద్ర ప్రభుత్వ పథకం

ఇంటింటికీ సోలార్ పవర్ కేంద్ర ప్రభుత్వ పథకం

ఢిల్లీ:  పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దాదాపు కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇవ్వనున్నారు. దీని కోసం 76వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్‌లపై రూఫ్‌టాప్ సోలార్ ప‌వ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు వెల్లడించారు. 

ALSO READ :- ఇద్దరు కంటె ఎక్కువ పిల్లలుంటే నో సర్కారీ జాబ్: సుప్రీంకోర్టు

ఈ మేరకు లబ్ధిదారులు సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ఫిబ్రవ‌రి 13న ఈ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.