నకిలీ, ఫ్రాడ్ మొబైల్ కనెక్షన్లు 55.5 లక్షలు.. వాటిని తొలగింంచాం: కేంద్ర టెలికం శాఖ

నకిలీ, ఫ్రాడ్ మొబైల్ కనెక్షన్లు 55.5 లక్షలు.. వాటిని తొలగింంచాం: కేంద్ర టెలికం శాఖ

టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీనికి కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. టెలికం వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నకిలీ పత్రాలపై పొందిన ఫేక్ మొబైల్ నంబర్లను గుర్తించి, చేసినట్లు కేంద్ర  టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.  మొత్తం 55.5 లక్షల మొబైల్ కనెక్షన్లును డిస్ కనెక్ట్ చేసినట్లు తెలిపారు. 

 రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నరే టెలికాం , ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానిమిస్తూ.. వినియోగదారులు  వారి పేరుతోజారీ చేరయబడిన అన్ని మొబైల్ లను తనికఖీ చేయడానికి మోసపూరిత మైన, అవసరం లేని కనెక్షన్లను తొలగించేందుకు వీలుగా సంచార్ సాధి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

అంతేకాకుండా SMS  ఆధారి సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు మోసపూరిత ఎస్ ఎంఎస్ లు పంపే ఎంటీటీలతోపాటు, కంటెంటె టెంప్లేట్లను AI ఆధారిత విశ్లేషణ చేశారు. దీని ద్వారా 2023 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ వరకు 36 శాతం SMS  ఆధారిత సైబర్ నేరాలను తగ్గించామని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వద్ల 4 లక్షల మంది పౌరులకు రూ. వెయ్యి కోట్ల ఆదా చేయగలిగామని మంత్రి తెలిపారు. అలాగే నకిలీ, నకిలీ పత్రాలపై తీసుకోబడిన 55.5 లక్షల  మొబైల్ కనెక్షలను డిస్ కనెక్ట్ చేశామని తెలిపారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు నివేదించిన దాని ప్రకారం సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్ కనెక్ట్ చేయబడ్డాయి. 1.3 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ చేయబడ్డాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.