
- సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్
ముషీరాబాద్, వెలుగు: నగరంలో ప్రమాదాలను తగ్గించేందుకే డే టైంలో కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని కనకాల కట్ట మైసమ్మ ఆలయం వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ..
రెండు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40కి పైగా కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఏకకాలంలో 10 బ్రీత్ అనలైజర్ మెషీన్లతో టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్ల పై ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని చెప్పారు. ఈ తనిఖీల్లో దోమలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.