ఇకపై MGNREGS ఆధార్ ఆధారిత చెల్లింపు గడువు పెరగదంట

ఇకపై MGNREGS ఆధార్ ఆధారిత చెల్లింపు గడువు పెరగదంట

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద కార్మికులకు ఏకైక చెల్లింపు విధానంగా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి గడువును పొడిగించదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఆగస్టు 31కు చివరి తేదీగా నిర్ణయించిన కేంద్రం.. MGNREGS కింద నమోదు చేసుకున్న వారికి వేతనాలు చెల్లించడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS)ని 2023 జనవరిలో ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS) తప్పనిసరిని చేస్తూ.. గడువు తేదీని ఫిబ్రవరి 1గా నిర్ణయించారు. ఆ తర్వాత మార్చి 31 వరకు, ఆ తర్వాత జూన్ 30 వరకు, చివరకు ఆగస్టు 31 వరకు పొడిగించారు. అయితే, గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారులు డెవలప్‌మెంట్ గడువును ఇకపై పొడిగించబోమని స్పష్టం చేశారు. యాక్టివ్‌గా ఉన్న కార్మికుల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానం చేశామని, ప్రస్తుతం అమలు బాగా జరుగుతోందని వారు తెలిపారు.

జూన్‌లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల క్రియాశీల లబ్ధిదారులలో, 13.75 కోట్ల మంది లబ్ధిదారులను ఆధార్‌కు అనుసంధానం చేశారు. మంత్రిత్వ శాఖ ప్రకారం, మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్లు ప్రామాణీకరించబడ్డాయి. 77.81 శాతం మంది ఆ సమయంలో ABPSకి అర్హులుగా ఉన్నట్టు గుర్తించారు. మే 2023లో, దాదాపు 88 శాతం వేతన చెల్లింపులు ABPS ద్వారా జరిగాయి. MGNREGS లబ్ధిదారులకు జారీ చేసిన జాబ్ కార్డ్‌ల డేటా ఆధారంగా.. కార్మికుడు ABPSకి అర్హులు కాదనే కారణంతో తొలగించలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది.