వైట్ లేబుల్ ఏటీఎంలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా మరిన్ని ATMలు

వైట్ లేబుల్ ఏటీఎంలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా మరిన్ని ATMలు

దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)  వ్యాప్తిని పెంచే ప్రక్రియలో భాగంగా  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ లేబుల్ ATM(WLA)లను ఏర్పాటు, నిర్వహణ, అపరేట్ చేసుకు నేందుకు నాన్ బ్యాంకింగ్ కంపెనీలకు అనుమతినిచ్చింది. బ్యాంకు ఖాతాదారులకు నగదు పంపిణీతోపాటు WLA ల ద్వారా  సాధారణ బిల్లు చెల్లింపు, నగదు డిపాజిట్, ఖాతా సమాచారంతో సహా పిన్ మార్పు, చెక్ బుక్ కోసం అభ్యర్థనలు వంటి ఇతర సేవలను అందించవచ్చని ఆర్బీఐ తెలిపింది. WLA ఆపరేటర్లు సంపూర్ణ నగదును కొనుగోలుకు, బిల్లు చెల్లింపు, క్యాష్ డిపాజిట్ సేవలు, సహ-బ్రాండెడ్ ATM కార్డ్‌లను జారీ చేయడానికి బ్యాంకులను అనుమతించడం ద్వారా ATMల పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఎక్కువ మంది నాన్-బ్యాంకు కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ఆర్బీఐ(RBI) తెలిపింది. 

వైట్ లేబుల్ ATMలు అంటే ఏమిటి?
బ్యాంకుయేతర సంస్థలచే  ఏర్పాటు చేయబడి, యాజమాన్యం, నిర్వహించబడే ATMలను వైట్ లేబుల్ ATMలుగా సూచిస్తారు. RBI ద్వారా చెల్లింపు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 ప్రకారం ATMలను ఆపరేట్ చేయడానికి బ్యాంకుయేతర సంస్థలు అనుమతించారు.  భారతదేశంలో నాలుగు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు ఉన్నారు. ఈ కంపెనీలు ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్, హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ , వక్రాంగీ లిమిటెడ్. దాదాపు వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN) అవసరమయ్యే  అన్ని బ్యాంకు ATMల వలెనే  ఈ ATMల వినియోగానికి చెల్లుబాటు అయ్యే కార్డు ఉంటుంది. సాధారణ బిల్లు చెల్లింపు, నగదు డిపాజిట్, ఖాతా సమాచారం, పిన్ మార్పు , చెక్ బుక్ అభ్యర్థనలు వంటి అనేక రకాల సేవలను కూడా WLAలు అందిస్తాయి.

బ్రౌన్ లేబుల్ ATMల నుంచి అవి ఎలా విభిన్నంగా ఉన్నాయి?
WLAల వలె కాకుండా, బ్రౌన్ లేబుల్ ATMలు అంటే యంత్రం హార్డ్‌వేర్,  లీజు సర్వీస్ ప్రొవైడర్ యాజమాన్యంలో ఉంటుంది. అయితే నగదు నిర్వహణ ,కనెక్టివిటీ సేవలు ATMలో ఉపయోగించే బ్రాండ్ ద్వారా నిర్వహించబడతాయి.  ATM హార్డ్‌వేర్‌ను కలిగి ఉన్న సర్వీస్ ప్రొవైడర్..ATM సైట్‌ను కనుగొనడం, భూస్వామితో లీజు ఒప్పందాలపై చర్చించడం, మెషిన్ కియోస్క్‌కి విద్యుత్ సరఫరా వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. అయితే బ్యాంక్ బ్రాండ్‌ను ప్రదర్శిస్తుంది కాబట్టి సేవలు స్పాన్సర్ బ్యాంక్ ద్వారానే నిర్వహించబడతాయి. 

బ్రౌన్ లేబుల్ ATM నిర్వహణ బ్యాంకులకు తక్కువ ఖర్చుతో కూడికున్నది కాబట్టి దేశవ్యాప్తంగా వేలాది బ్రౌన్ లేబుల్ ATMలు ఉన్నాయి. WLAలు ఆపరేట్ చేయడానికి RBI నుండి లైసెన్స్ తప్పనిసరి.. అయితే కంపెనీ స్పాన్సర్ బ్యాంక్‌తో ఒప్పంద ఒప్పందాన్ని కలిగి ఉన్నందున బ్రౌన్ లేబుల్ ATMలు నేరుగా సెంట్రల్ బ్యాంక్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఎల్‌ఏ(WLA)లు పెరుగుతున్నందున, బీఎల్‌ఏ(BLA)ల వినియోగం తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

ATMలకు వేర్వేరు లేబుల్స్ ఉన్నాయా?
WLAలు , BLAలు కాకుండా  మరికొన్న ATM లేబుల్‌లు ఉన్నాయి. వాటిని నాలుగు వేర్వేరు రంగులుగా విభజించవచ్చు - ఆకుపచ్చ, గులాబీ, పసుపు, నారింజ. గ్రీన్ లేబుల్ ATM ప్రధానంగా వ్యవసాయ లావాదేవీలు, రైతులు, గ్రామీణ వినియోగదారులచే ఉపయోగించబడుతుంది. పింక్ లేబుల్ ATMని భద్రత సౌలభ్యం దృష్ట్యా మహిళలు మాత్రమే యాక్సెస్ చేస్తారు. ఎల్లో లేబుల్ ATM ఇ-కామర్స్ ప్రయోజనాలకు,  ఆన్‌లైన్ షాపింగ్, వ్యాపారులచే ఉపయోగించబడుతుంది. షేర్ లావాదేవీల కోసం ఆరెంజ్ లేబుల్ ATM ఉపయోగించబడుతుంది.