డబ్బులు, అధికారం ముందు ఏవీ నిలబడవు

డబ్బులు, అధికారం ముందు ఏవీ నిలబడవు

డబ్బులు, అధికారం ముందు ఏవీ నిలబడలేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకలు తక్కువైపోయాయని ఆయన అన్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు మాత్రమే ప్రజల తరుపున పోరాడుతూ ప్రశ్నించేవారని చాడ అన్నారు. 'గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పట్టభద్రుల దగ్గరికి వెళ్లి జయసారధి రెడ్డి తరుపున ప్రచారం చేశాం. హైదరాబాద్‌లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి మద్దతు ఇచ్చి ఉద్యోగుల అందరినీ కలవడం జరిగింది. డబ్బులు, అధికారం ముందు ఏవీ నిలబడలేవు. మా అభ్యర్థి జయసారధి రెడ్డికి 13 వెల ఓట్లు వచ్చాయి. కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ అమలు చేయాలి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్. రాబోయే కాలంలో ప్రత్యక్ష ఆందోళనతో ఐక్యంగా ఉద్యమిస్తాం. కొలువుల కొట్లాట కోసం నిరుద్యోగులకు మద్దతు ఇస్తున్నాం. నాణ్యత లేని పనులు చేయడం వల్లే సూర్యాపేటలో కబడ్డీ గ్యాలరీ కూలిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపి దోషులను శిక్షించాలి. ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్‌లకు ఒకవిధంగా, ఔట్ సోర్స్ సర్వీస్‌లకు ఒకవిధంగా జీతాలు ఉంటున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులతో వెట్టి చాకిరి పనులు చేయిచుకుంటున్నారు' అని చాడ ఆరోపించారు.