చాయ్ షాట్స్ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‎లో ఇకపై సీరియల్స్‌‌‌‌

చాయ్ షాట్స్ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్‎లో ఇకపై సీరియల్స్‌‌‌‌

షార్ట్ సిరీస్‌‌‌‌తో ఆకట్టుకుంటోన్న ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫారం ‘చాయ్ షాట్స్’.. మరో అడుగు ముందుకేస్తూ కొత్త సీరియల్స్‌‌‌‌తో పాటు తెలుగు ఐకానిక్ టీవీ షోస్‌‌‌‌ను ఈ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఆ వివరాలను వెల్లడించేందుకు బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ‘యంగ్ ఆడియన్స్‌‌‌‌ కోసం కంటెంట్ చేశాం. కానీ మా ఆడియన్స్‌‌‌‌లో దాదాపు డెభ్బై శాతం 35 ఏళ్లు పైబడినవారు ఉన్నారు. వారందరి కోసం రమణి గారిని సంప్రదించి, టీవీకి పని చేస్తున్న యాక్టర్స్, డైరెక్టర్స్‌‌‌‌తో కలిసి పదుల సంఖ్యలో షార్ట్ సీరియల్స్ రూపొందించాం.

 ఒక్కో సీరియల్‌‌‌‌లో రెండు నిమిషాల నిడివితో 30 ఎపిసోడ్స్‌‌‌‌ ఉంటాయి. అలాగే డివోషనల్ షోస్ కూడా ప్రారంభించాం. ‘ఋతురాగాలు’ వంటి కల్ట్ సీరియల్స్‌‌‌‌తో పాటు తెలుగు షోస్‌‌‌‌ను తీసుకురాబోతున్నాం. హరితేజ గారితో ‘పట్టుకుంటే పట్టు చీర’ షో చేస్తున్నాం. టీవీలో ఉన్న డ్రామా, ఎమోషన్స్‌‌‌‌ లాంటివన్నీ యాప్‌‌‌‌లోకి తీసుకురావడం మా లక్ష్యం’ అని చెప్పారు.  

అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ ‘మన సంస్కృతిని ప్రతిబింబించే కంటెంట్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాలి అనేది మా లక్ష్యం. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్టుగా భావోద్వేగాలు ఎప్పుడూ మారవు, వాటి రూపమే మారుతుంది’ అని చెప్పారు. క్రియేటివ్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేయడానికి టీమ్ ఎంతో సహకరించిందని,  మంచి సీరియల్స్‌‌‌‌ను షార్ట్ ఫార్మాట్‌‌‌‌లో అందిస్తున్నట్టు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి చెప్పారు. నిర్మాతలు నాగబాబు, భారతి కృష్ణ, నటీనటులు సుహాసిని, వాసు ఇంటూరి,  హరితేజ, కె.సుధ తదితరులు పాల్గొన్నారు.