
- హరీశ్ రావుపై చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలకు బేసిన్లు, బేసిక్స్ తెలియవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బేసిక్ నాలెడ్జీతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే కాళేశ్వరం కూలేశ్వరంగా మారేది కాదని కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో హరీశ్ రావు తన మామ కేసీఆర్‌ను విలన్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఉన్న అపారమైన జ్ఞానంతోనే కాళేశ్వరం కూలిపోయిందని దుయ్యబట్టారు.
హరీశ్‌కు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువన్నారు. సీఎంగా రేవంత్‌ని చూడడం జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే బనకచర్ల పంచాయితీ మొదలైందన్నారు.