తెలంగాణలో మూడురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్స్

తెలంగాణలో మూడురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్స్

రాష్ట్రంలో రెండు,మూడు రోజులుగా కొన్ని జిల్లాల్లో జోరు వానలు దంచుతున్నాయి.  కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణశాఖ అధికారి ధర్మరాజు. మూడ్రోజులుగా పడుతున్న వడగండ్ల వానలకు పలు ప్రాంతాల్లో తీవ్రంగా పంటనష్టపోయారు రైతులు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  వైరా, ఏన్కూర్, కొణిజర్ల మండలాల్లో వడగండ్ల వాన పడటంతో  మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నట్టు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు తెలిపారు. వైరా నియోజకవర్గంలోని  ఏన్కూర్  కొణిజర్ల  మండలాల్లో  రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న మిర్చి పంటలను రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు. పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు వెంటనే సర్వే చేపట్టి రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కుమ్రం భీం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ మండలం అడ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వస్తోంది. అధికారులు ఒక గేటు ఎత్తి 283 క్యూసెక్కుల నీటిని దిగువకు  విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు.  ప్రస్తుతం 242 మీటర్ల నీరు ఉంది.

వడగండ్ల వానతో నష్టపోయిన తమను ఆదుకోవాలని వరంగల్ జిల్లాలో రైతున్నలు రోడ్డెక్కారు. నర్సంపేట నియజక వర్గంలో అకాల వడగండ్ల మూలంగా భారీగా రైతులు నష్టపోయారు. తమను   రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ  నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకా నిర్వహించారు. రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట డివిజన్ లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులతో మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకుంటామని  అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షం పడింది.  దీంతో వాహనాదారులు, బాటసారులు తడిసి ముద్దయ్యారు. రోడ్లపైన వాన నీరు చేరి వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు వెళ్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

భారత్లో కరోనా కలకలం.. రెండున్నర లక్షలు దాటిన కేసులు