భారత్లో కరోనా కలకలం.. రెండున్నర లక్షలు దాటిన కేసులు

భారత్లో కరోనా కలకలం.. రెండున్నర లక్షలు దాటిన కేసులు

భారత్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య 6.7 శాతం పెరిగింది. మరోవైపు వైరస్ నుంచి రకవరీ కేసులు 1,09,345 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12,72,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేట 14.78 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు  5,753 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 24 గంటల్లో కరోనా కారణంగా 315 మంది మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,85,350కు చేరింది. 

మహారాష్ట్రలో కొత్తగా 46,406 కేసులు, 36 మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 28,867 కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి. కర్ణాటకలో కొత్తగా 25,005 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 23,467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20,911 కేసులు నమోదవ్వగా, 25 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా 14,765 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు.