టీకా తీసుకున్నాక ఆస్పత్రిలో చేరే ఛాన్సెస్ తక్కువే

టీకా తీసుకున్నాక ఆస్పత్రిలో చేరే ఛాన్సెస్ తక్కువే

న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సామర్థ్యం పైన ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనని, టీకా తీసుకున్నాక ఆస్పత్రిలో చేరే చాన్సెస్ చాలా స్వల్పమని ఓ స్టడీలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97.38 శాతం మందికి తిరిగి కరోనాతో ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉండదని అపోలో ఆస్పత్రి తెలిపింది. టీకా తీసుకున్న వారిలో కేవలం 0.06 శాతం మంది మాత్రమే తిరిగి ఆస్పత్రిలో చేరే ఛాన్స్ ఉన్నట్లు అపోలో స్టడీలో స్పష్టమైంది. ఢిల్లీలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న పలువురు హెల్త్ వర్కర్స్ పై 100 రోజులపాటు ఈ స్టడీని నిర్వహించారు.