అనన్య పాండే, ‘కిల్’ ఫేమ్ లక్ష్య జంటగా రూపొందుతున్న మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోనీ దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మంగళవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ప్రేమలో మునిగితేలుతున్న క్రేజీ కపుల్‌గా అనన్య, లక్ష్య కనిపించారు. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.
లక్ష్య తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, అనన్య తన గ్లామర్, ఎమోషన్స్‌తో ఇంప్రెస్ చేసింది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా ప్రేమలో ఉండే గొడవలు, అలకలు, భావోద్వేగాలను టీజర్‌లో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. డైలాగ్స్‌తో పాటు విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. హైదరాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేబుల్ బ్రిడ్జ్, ట్యాంక్ బండ్ సహా ఇక్కడి లొకేషన్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించారు. మే 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
