చండీఘడ్లో కరెంటు కష్టాలు

చండీఘడ్లో కరెంటు కష్టాలు

విద్యుత్ సిబ్బంది సమ్మెతో చండీఘడ్ ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల సమ్మె నేపథ్యంలో 36 గంటలుగా కరెంటు సరఫరా లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం నుంచి వేలాది ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జన జీవనం స్తంభించిపోయింది. కనీసం తాగేందుకు నీరు కూడా లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ లైట్లు సైతం పనిచేయకపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. గవర్నమెంట్ హాస్పిటళ్లలో సర్జరీలను రీషెడ్యూల్ చేశారు. జనరేటర్లు ఉన్నప్పటికీ 100శాతం వాటిపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పవర్ కట్ కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. 

విద్యుత్ శాఖలో ప్రైవేటైజేషన్ను నిరసిస్తూ సిబ్బంది 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి విధులు బహిష్కరించడంతో ప్రజలకు కరెంటు కష్టాలు మొదలయ్యయి. సమ్మె విరమించాలని పవర్మెన్ యూనియన్ సభ్యులతో అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. విద్యుత్ శాఖను ప్రైవేటుపరం చేస్తే తమ సర్వీసుపై ప్రభావం చూపడంతో పాటు కరెంటు ఛార్జీలు పెరుగుతాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో చండీఘడ్ జిల్లా యంత్రాంగం విద్యుత్ శాఖలో ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్.. ఎస్మా ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెపై నిషేధం విధించింది. కరెంటు సరఫరా సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేశామని చండీఘడ్ అధికారులు చెబుతున్నా.. ఇప్పటికీ పలు రెసిడెన్షియల్ ఏరియాలు, మార్కెట్లలో కరెంటు లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చండీఘడ్లో కరెంటు సమస్యపై పంజాబ్, హర్యానా హైకోర్టు జోక్యం చేసుకుంది. బుధవారం కోర్టుకు హాజరుకావాలని చీఫ్ ఇంజనీర్కు సమన్లు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

లీజు తీసుకున్న స్థలంలో కోటి రూపాయల వజ్రం

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు