తొలి రోజు ముగిసిన చంద్రబాబు విచారణ

తొలి రోజు ముగిసిన చంద్రబాబు విచారణ

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఐడీ అధికారులు విచారించారు.  ఏడు గంటలపాటు విచారించిన సీఐడీ... చంద్రబాబు స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.  కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాదుల సమక్షంలోనే విచారించారు. భోజనానికి గంట సమయం.. నాలుగు సార్లు బ్రేక్ ఇచ్చారు. సీఐడీ డీఎస్పీ దనుంజయ్ నేతృత్వంలో విచారణ కొనసాగింది.  తొలిరోజు చంద్రబాబును 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారించారు.