చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో  ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.  తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ్ లూథ్రా, హరీష్ స్వాల్వే, సిద్దార్థ్ అగర్వాల్‌లు వర్చువల్ విధానంలో వాదనలు వినిపింయారు.  ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారుస్తున్నారు.

క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన హరీష్ సాల్వే... ఆర్టికల్ 17 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ అనుమతి తీసుకోలేదనీ... ప్రజాప్రతినిధుల అరెస్ట్ పై గత తీర్పులు అనేకం ఉన్నాయని వాదించారు. 2020లో నమోదైన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబును ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదన్న సాల్వే... ఎఫ్ఐఆర్ నమోదయ్యాకే అరెస్ట్ చేయాలి అన్నారు. చంద్రబాబు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదని అన్నారు. 

ఇక సీఐడీ తరపున ముఖుల్ రోహిత్ వాదించారు. షెల్ కంపెనీల జాడ వెలికి తీస్తున్నామన్నారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారమే నిధులు తప్పుదోవ పట్టాయని కోర్టుకు తెలిపారు.  రెండేళ్లు అన్నీ సాక్ష్యాలు  పూర్తిగా పరిశీలించిన తరువాత చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.  పోలీసులకు పూర్తిగా స్వేచ్చ ఇచ్చి చంద్రబాబు తరపు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కోట్టేయాలని కోర్టును కోరారు.  

సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చునని, ఎంతమంది సాక్షులనైనా కేసులో చేర్చవచ్చునన్నారు. అన్ని కోట్లు ఎక్కడకు వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీల జాడ తీస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందో తెలియాలన్నారు. అన్ని బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని కోర్టుకు తెలిపారు. ఈ డీల్‌కు అసలు కేబినెట్ ఆమోదమే లేదన్నారు.టీడీపీ అధినేత పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‍పై విచారణను ఈ నెల 21కి హైకోర్టు వాయిదా వేసింది.