వన్యప్రాణి సంరక్షణకు నేను సైతం అంటున్న చరణ్

వన్యప్రాణి సంరక్షణకు నేను సైతం అంటున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్యప్రాణి సంరక్షణ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచస్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో ఆయన కూడా పాలుపంచుకోనున్నాడు. ఆయన కొత్తగా నిర్మించిన ఇంట్లో  ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటుచేశాడు. ఇందులో సింహాలు, చిరుతపులులు,  జిరాఫీలు తదితర వన్యప్రాణుల ఫొటోలను ఏర్పాటుచేశాడు. ఈ ఫొటోలు తీయడంలో రామ్ చరణ్ తో పాటు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్ గావ్ కర్ లు ఫొటో గ్రాఫర్లుగా పనిచేశారు. ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పర్చడమే వీరి ఉద్దేశం. ఒక విధంగా ఇది రామ్ చరణ్ చేసే స్వచ్ఛంద సేవ.

ఈ భూమిని, ప్రకృతిని కాపాడటం కోసం WWF అనే స్వచ్ఛంద సంస్థ 60 ఏళ్లుగా పనిచేస్తోంది. అంతర్జాతీయంగా ఐదు మిలియన్ల సభ్యులతో 100 దేశాలలో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పర్యావరణ మార్పుల కారణంగా ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న తూర్పు కనుమల్లో అనేక వృక్షజాతలు, పక్షులు, కీటకాలకు రక్షణ లేకుండా పోయింది. కృత్రిమ వనరుల కల్పనతోనైనా వీటిని రపరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై వీరు దృష్టిపెట్టారు.

ఇదే విషయంపై మాట్లాడిన చరణ్.. భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందన్నాడు. ప్రకృతిలోకి నేను కెమెరాతో  ప్రయాణించడానికి కారణం ఇదేనని.. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా  అన్నాడు. ఈ కార్యక్రమం కోసం ముందుకు రావడానికి కారణం తన భార్య ఉపాసన కొణిదెల అని తెలిపాడు. ఈ గొప్ప కార్యకలాపాలు నిర్వహిస్తున్న WWF సంస్థకు ఉపాసన రాయబారిగా వ్యవహరిస్తున్నారని.. రామ్ చరణ్ కెమెరా వెనకున్న శక్తి ఉపాసనే అంటున్నారు ఫ్యాన్స్.

for more news…

నాలుగోసారి కూతురు పుట్టిందని.. ముగ్గురు బిడ్డల్ని చంపి తండ్రి ఆత్మహత్య
హాస్యనటుడు అలీకి మాతృ వియోగం
నన్ను ఉరి తీయొద్దు: నిర్భయ దోషి పవన్ పిటిషన్‌పై కోర్టులో హైడ్రామా
ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?