
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ రోహిత్ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలను అందజేశారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యులు 14 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 11 మంది పురుషులు కాగా... ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు ACM క్యాడర్ కు చెందిన వారని ఎస్పీ రోహిత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.ఈ ఏడాది ( 2025) ఇప్పటి వరకు వివిధ క్యాడర్లో పనిచేస్తున్న 227 మందిమావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.