
చంద్రకాంత్ దత్త, రేఖ నిరోషా జంటగా బర్ల నారాయణ దర్శకత్వంలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘చీటర్’. సెప్టెంబర్ 22న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’ అన్నాడు. అవుట్ పుట్ బాగా వచ్చిందన్నారు నిర్మాత శ్రీనివాస్ రెడ్డి. రాధిక, అనిత, మల్లేశం తదితరులు ఇతర పాత్రలు పోషించారు.