ఉపసర్పంచ్‌లకు చెక్‌!

ఉపసర్పంచ్‌లకు చెక్‌!

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్న ఉపసర్పంచ్‌లపై చర్యలకు ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. సరైన కారణాలు లేకుండా చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్న ఉపసర్పంచ్‌ల స్థానంలో, మరో వార్డు మెంబర్‌‌కు చెక్‌లపై సంతకం చేసే పవర్‌‌ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించింది. ఇందుకోసం గ్రామసభ ఏర్పాటు చేసి, పంచాయతీ సభ్యులంతా కలిసి ఉపసర్పంచ్‌ స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికను జిల్లా కలెక్టర్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.