మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. స్కూల్లో రూ.7.85లక్షలు చోరీ

మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. స్కూల్లో రూ.7.85లక్షలు చోరీ

హైదరాబాద్: కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో మళ్లీ రెచ్చిపోయింది.చెడ్డీలు, ముఖానికి మాస్క్ ధరించిన దొంగలు అర్థరాత్రి మియాపూర్లో హల్చల్ చేశారు. ఓ స్కూల్ లో చొరబడి నగదు ఎత్తుకెళ్లారు.ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో వచ్చిన ఇద్దరు దొంగలు.. శనివారం (మార్చి16) అర్థరాత్రి  మియాపూర్ లోని వరల్డ్ వన్ స్కూల్ లో చొరబడి రూ. 7లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారు. దొంగలు నగదును ఎత్తుకెళ్తున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న వరల్డ్ వన్ స్కూల్  యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్కూల్ లో అమర్చిన సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు మియాపూర్ పోలీసులు.