మరో కొత్త ఇంటిని కొన్న ధోని

 మరో కొత్త ఇంటిని కొన్న ధోని

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. ఇప్పటికే తన స్వస్థలం రాంచీలో ఖరీదైన భవంతిలో నివసిస్తున్న ఈ టీమిండియా మాజీ సారథి తాజాగా ముంబై నుంచి పుణె వెళ్లే మార్గంలో పుణేకు అతి దగ్గరలో ఉన్న పింప్రి-చినాడ్ వద్ద ఉన్న ఓ అధునాతన భవంతిని కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేశాడు. ఈ ఇంటికి తన భార్య సాక్షితో కలసి దగ్గరుండి మరమ్మత్తు పనులు, కొద్దిగా మార్పులు, చేర్పులు చేయించేపనుల్లో బిజీగా ఉన్నాడట మన జార్ఖండ్ డైనమెట్. అంతర్జాతీయ క్రికెట్  కు గుడ్ బై ప్రకటించినప్పటికీ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు ధోనీ. సంపాదించిన డబ్బునంతా ఆస్తులు, ఫాం హౌస్ లు కొంటూ తన అభిరుచుకి తగినట్లు మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు. ఇటీవలే తన ఫామ్ హౌస్ లో ఆర్గానిక్ పంటలు పండించుకుని వాటినే తింటూ తన బంధు మిత్రులకు కూడా పంపి పంటల రుచులెలా ఉన్నాయని ఆరా తీస్తూ గడిపేస్తున్నాడట ధోనీ.