బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు : మందమర్రి పట్టణం మూడో జోన్ కు చెందిన పాత్రికేయుడు గజ్జెల చందర్ సోదరుడు ప్రైవేట్ లెక్చరర్ లింగయ్య గురువారం గుండెపోటుతో చనిపోగా అయన భౌతిక కాయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి సందర్శించారు. లింగయ్యకు నివాళి అర్పించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే పాము కాటుతో చనిపోయిన స్థానిక గాంధీనగర్​కు చెందిన 9 నెలల చిన్నారి జాన్సన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు.

చిన్నారి తల్లిదండ్రులు జీవన్, కీర్తిని ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వివేక్​ వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ లీడర్లు సోతుకు సుదర్శన్, మంద తిరుమల్ రెడ్డి, జావీద్, కడలి శ్రీనివాస రావు, పోలు శ్రీనివాస్, సంగి సంతోష్, రాచర్ల గణేశ్​, ఇషక్ తదితరులు పాల్గొన్నారు.