
- ఫొటోలకే పరిమితమైతే ఎట్ల ఇస్తరు?
- సోషల్ జస్టిస్ ప్రకారమే పోస్టులు
- స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలె
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
కోల్ బెల్ట్/చెన్నూరు: కాంగ్రెస్పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వాళ్లకే పదవులు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పట్టణ, మండల అధ్యక్షుల ఎంపిక కోసం ఇవాళ దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.. ఫొటోలకే పరిమితమైతే అలాంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వడం కష్టమన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లపై తప్పుడు పోలీసులు కేసులు పెట్టిందన్నారు.
‘ రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతా. వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారిస్తున్న. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ALSO READ | ఎంపీ వంశీకృష్ణకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : సూర్యనారాయణ
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గంలో భూదందా, బియ్యం దందా, ఇసుక దందా వంటివి లేకుండా చేశా.. ఎన్ని ఒత్తిళ్లు చేసిన ఈ దందాలు లేకుండా బంద్ చేయించా. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో సోషల్ జస్టిస్ దృష్టిలో పెట్టుకొని టీపీసీసీ నిబంధన మేరకు కమిటీలను ఎంపిక చేస్తారు. ’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.
టీపీసీసీ అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, లీడర్లను అధిష్టానం అండగా ఉంటుందన్నారు. వారికే సంస్థాగత ఎన్నికల కమిటీల్లో ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు.