- కన్నెపెళ్లి గ్రామంలో బోరు వేయించిన వివేక్ వెంకటస్వామి
- కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
కోల్బెల్ట్ : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇప్పుడు నిలబెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కన్నెపెళ్లి గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి వెళ్లడంతో ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యేగా గెలిచినవెంటనే బోరు వేయిస్తామని గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ గ్రామంలో బోరు వేయించారు.
దీంతో గ్రామంలో తాగునీటి కొరత తీరనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశౄరు. బోరు వేసి దాహాన్ని తీర్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హిమవంత రెడ్డి, చింతల శ్రీనివాస్, గ్రామస్తులు మాయ రమేశ్, జనగామ శ్రీనివాస్, వేంకల గట్టు, అక్కెం బాణయ్య, సాయి, రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.