కాంగ్రెస్తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు..కార్మికులకు ప్రయోజనం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు..కార్మికులకు ప్రయోజనం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం లోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు  సింగరేణి ఎండీతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగిందన్నారు.

గోదావరిఖని బృందావన్ గార్డెన్లో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్  ఐఎన్టియుసి మహాసభ మరియు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మినహాయింపు జరుగుతుం దన్నా రు. జైపూర్ లో మరో 100 మెగావాట్ల విద్యుత్ కర్మాగారం, సింగరేణికి కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉంది..అవికాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు ఎమ్మె ల్యే వివేక్ వెంకటస్వామి.

 వంశీకృష్ణను గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కారం:మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి ఎంపీ అభ్యర్ధిగా వంశీకృష్ణను గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్మికుల గొంతుకగా వంశీకృష్ణ ఢిల్లీలో పోరాడతారని చెప్పారు. సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ INTUC మహాసభ, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం గోదావరిఖనిలో జరిగింది. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, జాతీయ కార్యదర్శి బాబర్ సలీమ్ పాషా, ఇతర యూనియన్ నాయకులు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, వినోద్, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ హాజయ్యారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు INTUC లీడర్లు.