Premisthunna Movie:75కుపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇపుడు టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ.. ట్రైలర్ రిలీజ్

Premisthunna Movie:75కుపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇపుడు టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ.. ట్రైలర్ రిలీజ్

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను దర్శకుడు వెంకీ అట్లూరి రిలీజ్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ ‘అన్ కండిషనల్ లవ్‌‌తో తెరకెక్కిన సినిమా ఇది. చాలా కాలం తర్వాత  వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ట్రైలర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నాడు.  మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నిర్మాత అన్నారు. అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు డైలాగ్స్ అందించగా,  సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించాడు.

బాహుబ‌లి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, మ‌ళ్లీరావాతో పాటు తెలుగులో 75కుపైగా సినిమాల్లో చైల్డ్ యాక్ట‌ర్‌గా న‌టించాడు సాత్విక్ వ‌ర్మ‌. ఇప్పుడతడు హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో టాలీవుడ్ కి కొత్త హీరో ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా మారింది. ఇకపోతే, డైరెక్టర్ భాను శంక‌ర్‌.. తెలుగులో ఎవ‌రే అత‌గాడు, RDX ల‌వ్‌, రాజ‌ధాని ఫైల్స్‌, రాజు మ‌హారాజు సినిమాల‌ను డైరెక్ట్ చేశాడు.