పదో తరగతి బాలికకు పెళ్లి : క్యాన్సిల్ చేసి పరీక్షకు పంపారు

పదో తరగతి బాలికకు పెళ్లి : క్యాన్సిల్ చేసి పరీక్షకు పంపారు

హైదరాబాద్ : ఆ బాలిక చదువుతున్నది పదో తరగతి. తెల్లారితే పరీక్ష. కానీ ఆమె జీవితానికి సంబంధించిన పెద్ద పరీక్ష అదేరోజు. అంటే ఆ బాలిక చిన్నారి పెళ్లి కూతురైంది. అటు పరీక్ష..ఇటు పెళ్లి. అప్పటివరకు అన్ని పరీక్సలు రాసింది. అదే రోజు పెళ్లి కావడంతో పరీక్ష క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది. కానీ ఆ బాలిక అదృష్టం బాగుండి..ఈ విషయం తాను చదువున్న స్కూల్ టీచర్ల ద్వారా చైల్డ్ రైట్స్ కమిషన్ కు తెలిసింది. వెంటనే బాలిక ఇంటికి చేరుకున్న కమిటీ సభ్యులు పెళ్లి క్యాన్సిల్ చేయించారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన అధికారులు..మైనర్ బాలికకు పెళ్లి చేసీ, ఆమె జీవితం నాశనం చేయకూడదని తెలిపాడు.

బాలికను చేసుకోబోయే వరుడు ఆమె కన్నా 10 సంవత్సరాల పెద్దోడని..ఈమె వయసు 15 సంవత్సరాలు కూడా నిండలేదని.. స్కూల్ రికార్డులో తెలిసింది. పెళ్లి చేసుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వరుడికి చెప్పడంతో..రెండు కుటుంబాల సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.  ఆ బాలిక సంతోషంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసింది. కనీసం 21 సంవత్సరాలు నిండకుండా అమ్మాయి పెళ్లి చేయకూడదని తెలిపారు చైల్డ్ రైట్స్ కమిషన్ అధికారులు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ లోని నాచారంలో జరిగింది.