"లాక్ డౌన్" పదాన్ని వాడొద్దు

"లాక్ డౌన్" పదాన్ని వాడొద్దు

కరోనాకు పుట్టినిల్లుగా పిలుచుకునే చైనాలో మరోసారి కొవిడ్ కేసులు విలయతాండవం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల మళ్లీ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేసినా.. అది నామమాత్రపు పరిష్కారాన్ని మాత్రమే చూపగలిగింది. తాజాగా షాంఘైలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో.. అక్కడి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాలో లాక్ డౌన్ ముగిసిపోయిందనే మీడియా వార్తలపై అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయానికి జెండా ఊపింది. లాక్ డౌన్ అనే పదాన్ని వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. వుహాన్ లో మాదిరిగా షాంఘైలో లాక్ డౌన్ విధించలేదన్న ప్రభుత్వం.. అందుకే లాక్ డౌన్ ముగిసిందనే పదాన్ని వినియోగించొద్దనే సర్క్యులర్ ను విడుదల చేసింది. 

కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు లాక్ డౌన్ తో తీవ్ర అవస్థలు పడిన షాంఘైలో.. ఆహారం, నిత్యావసర వస్తువులు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరికొందరు లాక్ డౌన్ ను ఎత్తివేయాలంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండడంతో షాంఘైలోని దుకాణాలు, రెస్టారెంట్లు  తెరుచుకుంటున్నాయి. ఈ సందర్భంలో చైనా ప్రభుత్వం ఈ విధమైన ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది.
 

మరిన్ని వార్తల కోసం...

భారత్‌‌పై మళ్లీ కరోనా పంజా

ప్రియుడిని పెళ్లి చేసుకొనేందుకు బంగ్లాదేశ్ యువతి సాహసం