
బీజింగ్: అమెరికాకు చెందిన 6 కంపెనీలపై చైనా గురువారం ఆంక్షలు విధించింది. ఆ ఆరు కంపెనీల్లో మూడింటిని ‘నమ్మదగని సంస్థల జాబితా’లో చేర్చింది. దీంతో ఆ మూడు కంపెనీలు తమ దేశంతో వాణిజ్యం చేయకుండా నిషేధం విధించినట్లయింది. ఈ విషయాన్ని చైనా వాణిజ్య శాఖ తెలిపింది.
‘‘మానవరహిత వెహికల్ మేకర్ సారోనిక్ టెక్నాలజీస్, సాటిలైట్ టెక్నాలజీ కంపెనీ ఎర్కోం, సబ్ సీ ఇంజినీరింగ్ కంపెనీ ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్ కంపెనీలు తైవాన్‌కు మిలిటరీపరంగా సహాయం చేస్తున్నాయి. దీంతో మా దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలు ఆమూడు అమెరికా కంపెనీలతో దెబ్బతింటున్నది” అని పేర్కొంది.