3.77 కోట్ల పేటీఎం షేర్లు అమ్మకానికి... పేటీఎం నుంచి పూర్తిగా వెళ్లిపోతున్న యాంట్‌‌‌‌‌‌‌‌ఫిన్‌‌‌‌‌‌‌‌

3.77 కోట్ల పేటీఎం షేర్లు అమ్మకానికి... పేటీఎం నుంచి పూర్తిగా వెళ్లిపోతున్న యాంట్‌‌‌‌‌‌‌‌ఫిన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: యాంట్‌‌‌‌‌‌‌‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్ బీవీ  పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్‌‌లో  తన 5.84శాతం వాటాను ఆగస్టు 5న (మంగళవారం) మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  బ్లాక్ డీల్‌‌‌‌‌‌‌‌ ద్వారా విక్రయించనుంది.  మొత్తం 3.77 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.3,803 కోట్లకు అమ్మనుంది.  షేరుకు ఫ్లోర్ ధరను రూ.1,020గా నిర్ణయించారు. బ్లాక్‌‌‌‌‌‌‌‌డీల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిర్దిష్టమైన షేరు ధర దగ్గర పెద్ద ఇన్వెస్టర్ల మధ్య కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి.  పేటీఎం షేర్లు సోమవారం రూ.1,078.20 వద్ద ముగిశాయి. దీంతో పోలిస్తే   5.4 శాతం తక్కువ రేటుకు యాంట్‌‌‌‌‌‌‌‌ఫిన్ షేర్లను అమ్ముతోంది. అలీబాబా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ, పేటీఎం నుంచి పూర్తిగా ఎగ్జిట్ అవుతోంది.   

ఈ లావాదేవీ సెకండరీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతోంది.   కొత్తగా షేర్ల జారీ ఉండదు.   ఈ డీల్‌‌‌‌‌‌‌‌కు  సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, గోల్డ్‌‌‌‌‌‌‌‌మన్ శాక్స్​ (ఇండియా) సెక్యూరిటీస్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఆర్డర్ బుక్ ఆగస్టు 5న ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతుంది.  డిమాండ్ ఆధారంగా ముందుగానే క్లోజ్ చేయొచ్చు.  

షేర్లు ఆగస్టు 6న టీ+1 ప్రాతిపదికన సెటిల్ అవుతాయి. గత రెండేళ్లలో యాంట్‌‌‌‌‌‌‌‌ఫిన్ తన వాటాను  తగ్గించుకుంటూ వస్తోంది. 2023 ఆగస్టులో రూ.1,371 కోట్ల విలువైన వాటాను అమ్మింది.  ఇండియన్ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులను తగ్గించేందుకు రూల్స్ తెచ్చారు. దీనిలో భాగంగా  ఈ వాటా అమ్మకం జరిగింది. పేటీఎంకు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రూ.122 కోట్ల లాభాం వచ్చింది.