కరోనా సీక్వెన్సింగ్ పూర్తయినా..2 వారాలు లేట్ గా చెప్పిన చైనా!

కరోనా సీక్వెన్సింగ్ పూర్తయినా..2 వారాలు లేట్ గా చెప్పిన చైనా!

న్యూఢిల్లీ:   చైనాలోని ఓ ల్యాబ్ కు చెందిన సైంటిస్టులు కరోనా వైరస్ నిర్మాణం, దాని జీనోమ్ సీక్వెన్సింగ్ ను ముందే పూర్తి చేసినా.. ఆ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓకు చెప్పకుండా చైనా రెండు వారాలు ఆలస్యం చేసిందని అమెరికా ఆరోపించింది. చైనీస్ వైరాలజిస్ట్ డాక్టర్ లిలీ రెన్ కరోనా వైరస్ ను 2019, డిసెంబర్ 28కి ముందే ఐసోలేట్ చేసి, సీక్వెన్సింగ్ పూర్తి చేశారని, కానీ చైనా ఆ విషయాన్ని చెప్పకుండా జాప్యం చేసిందని ఈ మేరకు అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ ఓ నివేదికలో వెల్లడించింది.

కరోనా సీక్వెన్సింగ్ డేటాను వెంటనే వెల్లడించి ఉంటే.. మరింత త్వరగా వ్యాక్సిన్ కనుక్కునేందుకు వీలయ్యేదని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరస్ ను కట్టడి చేసేందుకు అవకాశం ఉండేదని తెలిపింది.