చాలామంది లవర్స్‌లో ఈ రోగం: లవ్ బ్రెయిన్ లక్షణాలు ఇవే

చాలామంది లవర్స్‌లో ఈ రోగం: లవ్ బ్రెయిన్ లక్షణాలు ఇవే

ప్రేమలో ఉన్నన్ని రోజులు గాల్లో తేలుతున్నట్లే ఉంటుంది. కానీ ఒక్కసారి బెడిసి కొడితే.. ఎంత లోతుగా వెళ్తే అంత ప్రమాదం. మానవ సంబంధాలు రోజురోజుకు చాలా బలహీనంగా మారుతున్నాయి. ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ, డబ్బుకు వ్యాల్యూ పెరగడం. అలాగే మనిషి మనిషితో గడిపే  టైం తగ్గిపోవడం ఇలాటి కారణాల వల్ల. ఇంట్లో తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. వారు పెద్దవారు అవుతుంటే అంతగా పట్టించుకోరు. కానీ పిల్లలు పెరుగుతున్నా కొద్దీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని అంటున్నారు సైకాలజిస్టులు. 

ఎందుకంటే..

పిల్లలు పెరుగుతున్నా కొద్దీ వాళ్ల అవసరాలు కూడా పెరుగుతూ పోతాయి. అయితే వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి ఎవరిపై ఆధారపడుతున్నారు. ఇలా ఒకరిపై అతిగా డిపెండ్ అవ్వడం కరెక్టేనా అనే విషయం తెలుసుకోవాలి. కొడుకు, కూతుళ్లు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు సంపాదనపై పడిపోతారు. ఆ గ్యాప్ లోనే పిల్లలు గాడి తప్పే ప్రమాదం ఉందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. 


లవ్ బ్రెయిన్ 

ఈ జనరేషన్ లో చాలా మంది యువకులు లవ్ బ్రెయిన్ అనే సైకలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్తు్న్నారు. 18 నుంచి 25 ఏళ్ల వారిని ఇది ఎక్కువగా అటాక్ చేస్తోంది. లవ్ బ్రెయిన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక వ్యక్తిపై పూర్తిగా డిపెండ్ అవ్వడం. మితిమీరిన ఇష్టం పెంచుకోవడం, రోజులో ఎక్కువసేపు వారి గురించే ఆలోచించడం, చిన్న చిన్న వాటికి కూడా ఇతరులపై ఆధారపడటం వంటి లక్షణాలతో వచ్చే మానసిక రోగమే ఈ లవ్ బ్రెయిన్. చైనాలో ఓ యువతి రోజుకు 100 సార్లు ఆమె బాయ్ ఫ్రెండ్ ని కలవరిస్తోంది. 

బాయ్‌ఫ్రెండ్ కనిపించకుంటే ఆగమాగం అయిపోవడం, ఎక్కడ ఉన్నావో చెప్పాలంటూ ఆగకుండా మెసేజ్‌లు చేయడం, తాను ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వాలంటూ బలవంతం చేయడం వంటి లక్షణాలు డాక్టర్లు ఆమెలో గుర్తించారు. ‘వియ్‌చాట్’ కెమెరా ఆన్‌చేసి పదేపదే మెసేజ్‌లు చేస్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. అయినప్పటికీ అతడు స్పందించకపోవడం, ఒకే రోజు వందసార్లకుపైగా కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె మానసికంగా కలత చెంది ఇంట్లోని వస్తువులను విసిరికొట్టడం, పగలగొట్టడం చేసేది. దీంతో ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బాల్కనీ నుంచి దూకుతానని ఆమె బెదిరించింది. 

ఎవరిలో ఎక్కువ..

ఈ లవ్ బ్రెయిన్ డిజార్డర్ ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.  ఎందుకంటే మగవారితో పోల్చుకుంటే ఆడవారే ఒంటరిగా, ఖాళీగా ఉంటారు.  పురుషుల కంటే స్త్రీలే ఇంటికే పరిమితమైపోతారు. లవ్ బ్రెయిన్ డిజార్డర్ బాయ్స్ లో తక్కువగానే కనిపిస్తోంది.