ఇనొవేషన్ ‌‌ఛాలెంజ్‌‌లో చింగారి యాప్ గెలిచింది

ఇనొవేషన్ ‌‌ఛాలెంజ్‌‌లో చింగారి యాప్ గెలిచింది

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్‌ యాప్ ‌‌ఇనొవేషన్ ‌‌ఛాలెంజ్‌‌లో షార్ట్ ‌వీడియో యాప్ చింగారితో పాటు మరో 22 ఇండియన్ ‌‌యాప్‌‌లు విన్నర్‌‌లుగా నిలిచాయి. ఎలక్ట్రానిక్స్‌‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఈ విషయాన్ని ప్రకటించింది. మేమై ఇండియా మూవ్‌‌, ‌‌సర్కార్‌‌, మైఐటీరిటర్న్‌ వంటివి విన్నర్‌‌గా నిలిచిన యాప్‌‌లలో ఉన్నాయి. మొత్తంగా న్యూస్‌‌, సోషల్‌‌, గేమ్స్‌‌, ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌, ఈ–లెర్నింగ్‌‌వంటి ఎనిమిది కేటగిరిలలో ఈ యాప్‌‌లు విన్నర్‌‌లుగా నిలిచాయి. 59 చైనీస్‌ యాప్‌‌లను బ్యాన్‌‌చేసిన తర్వాత ప్రభుత్వం ఈ ఛాలెంజ్‌‌ను లాంఛ్‌‌ చేసింది. ఇప్పటికే ఉన్న, కొత్తగా రాబోతున్న ఇండియన్ ‌యాప్‌‌లను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వం ఈ ఆత్మనిర్భర్‌ యాప్ ఇనొ వేషన్ ‌‌ఛాలెంజ్‌‌ను ప్రకటించింది.

తమ సెక్టార్ ల‌లో గ్లోబల్‌ స్థాయిలోఎదగగలిగే యాప్‌‌లను గుర్తించడానికి ఈ ఛాలెంజ్‌‌ ద్వారా వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది. వేరువేరు కేటగిరిలలోమొదటి స్థానంలో నిలిచిన యాప్‌‌కు రూ. 20 లక్షలు, రెండో స్థానం వచ్చిన యాప్‌‌కు రూ. 15 లక్షలు ఇస్తారు.మూడో స్థానంలో ఉన్న  యాప్‌‌కురూ.10లక్షలుఅందిస్తారు. అంతేకాకుండా ఈయాప్‌‌లు ఎదగడంలో ప్రభుత్వం సాయం చేస్తుంది. వీటిని జీఈఎంలో లిస్ట్ ‌చేస్తారు. సెక్యూరిటీ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని విన్నరను్ల సెలెక్ట్ చేశారు.