చింగారీ యాప్ సీన్ సితార్ అయ్యింది.. సగం మంది ఉద్యోగులను తీసేసింది

చింగారీ యాప్ సీన్ సితార్ అయ్యింది.. సగం మంది ఉద్యోగులను తీసేసింది

ఫైనాన్షియల్ క్రంచింగ్తో బెంగళూరుకు చెందిన షార్ట్ వీడియో ఫ్లాట్ ఫారమ్ చింగారీ రెండోసారి ‘లేఆఫ్’ ప్రకటించింది. ప్రాడక్ట్, కస్టమర్ సపోర్ట్, డిజైన్, మార్కెటింగ్లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. మరికొంత మంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే  చింగారి కంపెనీ 20 శాతం ఉద్యోగులను తొలగించింది. 

ప్రస్తుతం చింగారీ కంపెనీలో  50- నుంచి 60 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునుందుకు తొలగింపులతో పాటు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆప్టోస్ ల్యాబ్ నుంచి చింగారి సంస్థ నిధులను సేకరించింది. ఈ నిధులను వినియోగదారుల పెరుగుదల, ఉత్పత్తి పెంపు,  విస్తరణ, ఇంజనీరింగ్ బృందాన్ని పెంచేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపింది.