
ఈ ఫొటోలు చూస్తుంటే ఇదేదో కార్పొరేట్ ప్లే స్కూల్ అనిపిస్తోంది కదూ ! కాదు.. కాదు.. గవర్నమెంట్ ప్రైమరీ స్కూలే. బడి అంటే చిన్నారులకు ఉన్న భయం పోగొట్టడంతో పాటు వారిని ఆకట్టుకోవడం, ఆసక్తికరంగా పాఠాలు చెప్పడంపై సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దాతల సహకారంతో క్లాస్రూమ్ గోడలపై ఇలా రంగురంగుల పెయింటింగ్స్ వేయించి, చిన్నారుల కోసం ఆట వస్తువులు, టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయించడమే కాకుండా డిజిటల్ మోడ్లో పాఠాలు చెబుతున్నారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, సిద్దిపేట