నల్గొండ జిల్లా కలెక్టర్​గా సి.నారాయణరెడ్డి 

నల్గొండ జిల్లా కలెక్టర్​గా సి.నారాయణరెడ్డి 

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కలెక్టర్​గా చింతకుంట నారాయణరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నారాయణరెడ్డి వికారాబాద్​జిల్లా కలెక్టర్​గా పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం మహబూబ్ నగర్​జిల్లా నర్వ మండలం శ్రీపురం గ్రామం. గతంలో ములుగు, నిజామాబాద్​ జిల్లాల కలెక్టర్​గా ఆయన పనిచేశారు.

2011లో సూర్యాపేట ఆర్డీవోగా పనిచేసిన నారాయణరెడ్డి జిల్లాల పునర్విభజనలో భాగంగా తొలిసారిగా నల్గొండ జిల్లా జాయింట్​కలెక్టర్​గా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్​గా పనిచేస్తున్న దాసరి హరిచందనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెకు ఇంకా ఎక్కడ పోస్టింగ్​ ఇవ్వలేదు.